November 19, 2019

మీడియాపై ఆంక్షలా ? – ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి సోమిరెడ్డి

Clock Of Nellore ( Guntur ) – ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికా, మీడియా వ్యవస్థలపై ఆంక్షలు విధించడం ఏంటని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియాపై ఆంక్షలు విధించే విషయంలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విడుదల చేసిన జీఓనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంతో ఘర్షణ వైఖరి, మీడియాపై దాడులు, ఆంక్షలు, కేసుల పేరుతో ప్రతిపక్ష నాయకులకు వేధింపులు, గోదావరి నదిపై ప్రాజెక్టులు తదితర అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించినట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చేలా కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. నాలుగు నెలల్లో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిపోయిందని, గ్రామ స్థాయిలో రోడ్లు, మరుగుదొడ్లు నుండి… పోలవరం వరకూ అన్నీ పనులు నిలిచిపోయాయని, పరిపాలన స్థంభించిపోయిందని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంపై పెట్టుబడి దారుల్లో విశ్వసనీయత పోయిందని, పెట్టుబడులు పెట్టాలంటే అనుమానించే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. మద్య నిషేదం పేరుతో సొంత ఆదాయం పెంచుకుంటున్నారని, మంచి కంపెనీలను మూతవేయించి ప్రజల ఆరోగ్యాన్ని హరించే బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారని సోమిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, రుణమాఫీ, అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, కళాశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేశారని, అమరావతి, పోలవరం నిర్మాణాలను అయోమయంలో పెట్టేశారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!