November 22, 2019

అప్పుడు కాదు…. ఇప్పుడు రండి…. వైసీపి నేతలకు సోమిరెడ్డి హెచ్చరిక…

Clock Of Nellore ( Nellore ) – గ్రామాల్లో టిడిపి కార్యకర్తలపై కాదు…. దమ్ముంటే ఇప్పుడు రండి… మీ అంతు లేలుస్తాం…. అంటూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపి నేతలను ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. సోమవారం నెల్లూరులోని అనీల్ గార్డెన్స్ లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో ముందుగా సోమిరెడ్డి ప్రసంగించారు. అధికారం ఉందని వైసీపి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో టిడిపి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. రోజుకో చోట చొప్పున టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. వైసీపి నేతలు దమ్ముంటే ఇప్పుడు రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్ ప్రభుత్వం లాంటి ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతి, పోలవరం చివరకు మరుగుదొడ్ల పనులు కూడా నిలిపివేశారని అన్నారు. జగన్ మొండి వైఖరితో రాష్ట్రం తిరోగమన దిశగా పయనిస్తుందని త్వరలోనే ప్రజలు ఈ జగమొండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!