November 19, 2019

వైసీపి పాలనలో రాష్ట్రం తిరోగమనం – నెల్లూరులో సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి విమానంలో రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుండి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరుకు చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మాగుంట లే అవుట్ లోని అనీల్ గార్డెన్స్ కు చేరుకున్నారు. అక్కడ జిల్లా టిడిపి నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, గజమాలలతో సత్కరించారు. అనంతరం టిడిపి జిల్లా సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపి అవగాహన లేని పరిపాలనతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ మొండి వైఖరితో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిందన్న ఓర్వలేని తనంతో జగన్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్లను మూసివేశారని, రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదని విమర్శించారు. సిఎం జగన్ అవగాహన రాహిత్యంతో ఎప్పుడూ లేని విధంగా కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. అన్నీ ధరలు తగ్గుతుంటే జగన్ మాత్రం మద్యం ధరలను పెంచాలని ధ్వజమెత్తారు. మొన్నటి వరకూ జిఎస్టీ ఉండేదని ప్రస్తుతం రాష్ట్రంలో దాని బదులు జేఎస్టీ వసూలు చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, నిజమైన అభ్యర్ధులకు మొండి చేయి చూపించి కేవలం వైసీపి కార్యకర్తలకే ఉద్యోగాలకు ఎంపిక చేశారని విమర్శించారు. పేదవారి సొంతింటి ఇల్లు సాకారం చేసే విధంగా గతంలో తాము వేల ఇళ్లను నిర్మిస్తే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిరుపేదలకు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించారు. రివర్స్ టెండర్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వు టెండర్లు నిర్వహిస్తుందని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనను పక్కన బెట్టి టిడిపి కార్యకర్తలను వేధించేపనిలో ఉన్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!