November 19, 2019

పెన్నాలో కొనసాగుతున్న వరద ఉధృతి – పొంగిపొర్లుతున్న నెల్లూరు బ్యారేజీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్ధ్యంతో ఉండటంతో గత రెండు రోజులుగా పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతుంది. 40వేల క్యూసెక్కుల మేర పెన్నాకు నీటిని విడుదల చేస్తుండటంతో అటు సంగం బ్యారేజీతో పాటూ నెల్లూరులోని పెన్నా బ్యారేజీ కూడా సోమశిల జలాలతో పొంగిపొర్లుతోంది. సోమశిల జలాల విడుదల అనంతరం శుక్రవారం సాయంత్రం నెల్లూరు బ్యారేజీకి చేరుకున్న జలాలు గంట గంటకూ నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రం నీటి ప్రవాహం అధికంగా కనిపించింది. నెల్లూరు బ్యారేజీ నుండి జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. వారం రోజుల క్రితం పెన్నాలో అక్కడక్కడే కనిపించిన జలాలు, శనివారంకు పెన్నానదీ పరివాహక ప్రాంతానికంతా విస్తరించాయి. మరో వైపు చాలా కాలం తర్వాత పెన్నాకు నీరు రావడంతో నగర వాసులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు నెల్లూరు బ్యారేజీ వద్దకు వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!