November 22, 2019

సోమశిలలో 75 TMC లు దాటిన నీటి నిల్వ – నాలుగు గేట్లు తెరిచిన అధికారులు

Clock Of Nellore ( Somasila ) – నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయంలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. జలాశయం పూర్తి స్థాయి సామర్ధ్యం 78 TMCలు కాగా, ఆదివారం మధ్యాహ్నంకు 75 TMCలు దాటింది. ఎగువున కుందూ నది నుండి వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో సోమశిల ఎప్పుడూ లేని విధంగా గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంటుంది. అధికారులు జలాశయంలో 75 TMCల నీటి నిల్వను కొనసాగిస్తూ మిగులు జలాలను కండలేరు, ఉత్తర, దక్షిణ కాలువలకు విడుదల చేస్తున్నారు. అయితే ఇన్ ఫ్లో రోజు రోజుకూ పెరుగుతుండటంతో శనివారం ఉదయం జలాశయం 11వ గేటును తెరిచి పెన్నాకు నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయం మరో మూడు గేట్లను తెరిచారు. దీంతో పెన్నానదిలోకి సోమశిల జలాలు ప్రవేశిస్తున్నాయి. మరో వైపు సోమశిల నుండి జలాలు సంగం ఆనకట్టకు చేరుకోవడంతో చఫ్టాపై నీరు ప్రవహిస్తున్నారు. దీంతో దానిపై రాకపోకలను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!