November 16, 2019

చంద్రబాబు నెల్లూరు పర్యటనపై టిడిపి నేతల సమీక్ష – అనీల్ గార్డెన్స్ ను పరిశీలించిన మాజీ మంత్రులు

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 14, 15 తేదీల్లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరులో పర్యటించనున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటూ ఆయన నెల్లూరులోనే ఉంది నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే వైసీపి అనుసరిస్తున్న దౌర్జన్య పూరితమైన విధానాలపై చర్చించి కార్యకర్తల్లో దైర్యాన్ని నింపనున్నారు. చంద్రబాబు పర్యటన నేపద్యంలో ఏర్పాట్లపై శుక్రవారం మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, పాశిం సునీల్ కుమార్, కంభం విజయరామిరెడ్డి, మాజీ మేయర్ అజీజ్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, డాక్టర్ జడ్. శివ ప్రసాద్, నుడా మాజీ ఛైర్మైన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో చర్చించారు. అనంతరం సమీక్షలు నిర్వహించే మాగుంట లే అవుట్ లోని అనీల్ గార్డెన్స్ ను సందర్శించి దాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు, చంద్రబాబు బస తదితర విషయాలపై మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ

ఈ నెల 14వ తేదీనా ఉదయం 10 గంటలకు చంద్రబాబు నాయుడు నెల్లూరుకు చేరుకుంటారని చెప్పారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ అనీల్ గార్డెన్స్ లో టిడిపి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారని మధ్యాహ్నం తర్వాత రాత్రి వరకూ 6 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. 15వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వైసీపి అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, వైసీపి దాడులకు గురైన బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం తర్వాత నుండి సాయంత్రం వరకూ మిగిలిన 4 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్తారని అమర్ నాథ్ రెడ్డి తెలియజేశారు. అంతకు ముందు జిల్లా టిడిపి కార్యాలయంలో అమర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసిందని తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలవరాన్ని పూర్తి చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!