January 23, 2020

రాజధానిని మార్చడం మీ తరం కాదు – సీఎం పై సోమిరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర రాజధాని మార్పు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమైతే మాట్లాడారో.. అవే అంశాలను జి ఎల్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు ఇచ్చిన రిపోర్టులో ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదించి, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని, అటువంటి రాజధానిని మారుస్తాం అంటే కేంద్రం కూడా ఒప్పుకోరు అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మంచి పద్ధతి కాదని దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి రేటు పడిపోతుందని సోమిరెడ్డి తెలిపారు. రాజధానిని మార్చడం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద కోపంతో, కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఇప్పటికైనా ఓసారి పునరాలోచించుకోవాలని హితవు పలికారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆవేదనతో మండి పడుతున్నారు అని, వారికి సర్కారు ఏం సమాధానం చెబుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!