November 19, 2019

వెంకటగిరి నియోజకవర్గంలో జలకళ – పలు కాలువలకు నీరు విడుదల చేసిన ఆనం

Clock Of Nellore ( Venkatagiri ) – నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో మంగళవారం జలకళ సంతరించుకుంది. మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామ నారాయణరెడ్డి రైతుల హర్షధ్వానాల మధ్య పలు కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. రాపూరు మండలం, సంక్రాంతి పల్లి సమీపాన 2ఏ బ్రాంచ్ కాలువ నుండి మరియు చెర్లోపల్లి సమీపాన 2బి బ్రాంచ్ కాలువకు ఆనం సాగునీటి విడుదల చేశారు. అలాగే డక్కిలి మండలం, వెలికల్లు మెయిన్ రోడ్డు సమీపాన 3వ బ్రాంచ్ కాలువ మరియు మోపూరు – వడ్డిపల్లి సమీపాన 4వ బ్రాంచ్ కాలువ నుంచి రామనారాయణరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలాయపల్లి మండలం, ఊట్లపల్లి సమీపాన ఉన్న 5వ బ్రాంచ్ కాలువ నుంచి కూడా ఎమ్మెల్యే ఆనం సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్పీ బల్లి దుర్గా ప్రసాద్ తో పాటూ గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంతో పాటూ సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బంది లేకుండా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రణాళికలు సిద్దమయ్యాయని నేడు ఆయన కుమారులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తవుతున్నాయని అన్నారు. ఓ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటే రెండో పంటకు కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!