November 22, 2019

ఇది ఇన్ స్టాల్ మెంట్ ప్రభుత్వం – నెల్లూరులో జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) – టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం నెల్లూరుకు చేరుకున్న చంద్రబాబు అనీల్ గార్డెన్స్ లో పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల సమీక్షను నిర్వహించారు. మంగళవారం ఉదయం వైసీపి బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మధ్యాహ్నం తర్వాత మిగిలిన 6 నియోజకవర్గాల సమీక్షను పూర్తి చేసిన చంద్రబాబు రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడి రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రెస్ మీట్ లో ఆయనేం మాట్లాడారంటే… రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో బీహార్ లా మారుస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం అరాచకాలకు పరాకాష్టగా మారిందన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం పేరుతో వారికి అనుకూలమైన వారికి పనులు ఇచ్చేందుకు రిజర్వు టెండర్లు అన్నారు. వారి రివర్స్ విధానాలతో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. మూడు వేలు పెన్షన్ అని చెప్పి దశల వారీగా అంటూ మాటమార్చారని అన్నారు. రైతు భరోసా అంటూ ఎన్నికల్లో ఊదర గొట్టారు. ప్రజలకు విద్యుత్ ఇవ్వడంలో విఫలమయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. కేంద్ర పథకంతో రాష్ట్రానికి సంభందం ఏంటి. కేంద్రం ఇచ్చే నిధులను ఎలా వాడుకుంటారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఇన్ స్టాల్ మెంట్ ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడును తామే పూర్తి చేశామని, తాము పనులు పూర్తి చేశాము కాబట్టే నేడు పూర్తిగా నీటి నిల్వ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. సిఎం తప్పుడు నిర్ణయాలతో గ్రామీణ అభివృద్ధి ఆగిపోతుందని, గతంలో చేసిన పనులకు నగదు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. జగన్ ప్రవర్తన వల్ల పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. వర్షాలకు గుంతలమయమైన రోడ్లపై తట్టమట్టి వేసే పరిస్థితి లేదని, వైసీపి కార్యకర్తలకు ప్రభుత్వ నిధులు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల పేరుతో వైసీపి కార్యకర్తలను నియమించి నిజమైన అభ్యర్ధులకు అన్యాయం చేశారన్నారు. నరేంద్ర మోడీకి నాకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వారితో విభేదించానన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాలంటే ముఖ్యమంత్రి జగన్ భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసే వారు అభివృద్ధిని కాంక్షించాలని మన ముఖ్యమంత్రి మాత్రం రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!