November 21, 2019

మీ నాయకుడు… మీ ఇష్టం… కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) – పార్టీ బలోపేతానికి వినూత్న మార్పులు తీసుకురానున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడకుండా పైపై సోకులు చూపే వారికి ఇకపై ప్రాధాన్యత ఉండబోదని, కష్టపడి పనిచేసే వారికే అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నెల్లూరు సభలో స్పష్టం చేశారు. టిడిపిని వీడి ఎంత మంది నేతలు వెళ్లినా పార్టీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఒక్కో కార్యకర్తలు ఒక్కో నేతగా మారుస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుకుండా నియోజకవర్గాలను జలగల్లా అంటిపెట్టుకుని ఉన్న నేతల స్థానంలో కార్యకర్తల కోరిక మేరకు నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇకపై మీ నేతను మీరే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్లు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం కష్టపడి పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోయానని ఈ ఐదేళ్లు నిత్యం కార్యకర్తలతోనే ఉంటానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై నియోజకవర్గాల వారీగా ప్రతీ కార్యకర్తతో మాట్లాడుతానని వారి చెప్పే సూచనలు తప్పకుండా పాటిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!