January 23, 2020

లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా లీలాధర్ రెడ్డి – నేడు ప్రమాణ స్వీకారం

Clock Of Nellore ( Nellore ) – సేవా కార్యక్రమాల్లో విశేష గుర్తింపు కలిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని అధ్యక్షునిగా నెల్లూరు నగరానికి చెందిన బంగారు వర్తకులు పి. లీలాధర్ రెడ్డి ఎంపికైనారు. ఆదివారం రాత్రి నెల్లూరులో జరిగే కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటూ క్లబ్ నూతన కార్యదర్శిగా ఎస్. సుధీర్ బాబు, కోశాధికారిగా ఎమ్. హర్షవర్ధన్ ప్రమాణ చేస్తారు. అలాగే లయన్స్ క్లబ్ లో మహిళా విభాగమైన ప్రియదర్శిని క్లబ్ నూతన అధ్యక్షురాలిగా బైసాని అరుణ, కార్యదర్శిగా ఎస్. సువర్ణకుమారి, కోశాధికారిగా కోట రేష్మ ప్రమాణం చేస్తారు. అంతే కాకుండా చిన్నపిల్లల విభాగమైన లియో క్లబ్ కు కూడా నూతన కమిటి ఏర్పాటైంది. లియో క్లబ్ అధ్యక్షుడిగా జ్ఞానదీప్, కార్యదర్శిగా జే.వి.దీపన్, కోశాధికారిగా కే. అనుష్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నెల్లూరు మైపాడు గేటు సెంటర్ లో ఉన్న కేపిఆర్ గ్రాండ్ మండపంలో ఆదివారం రాత్రి వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 2019 – 2020 సంవత్సరానికి గానూ ఈ కమిటీలను ఎన్నుకున్నారు. నూతన కమిటీలకు క్లాక్ ఆఫ్ నెల్లూరు వెబ్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!