November 12, 2019

వైఎస్ఆర్ వాహన మిత్ర గడువు పెంపుపై హర్షం – నెల్లూరులో జగన్ చిత్రపటానిక పాలాభిషేకం

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు 10వేల రూపాయల ఆర్ధిక సాయం అందించే పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. దీనిపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని 33వ డివిజన్ పరిధిలోని నిప్పో సెంటర్ లో డివిజన్ వైసీపి ఇంఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘనాథ్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ 70 శాతం మంది డ్రైవర్లు వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందారని, 100 శాతం అందరికీ అందాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ వాహన మిత్ర ధరఖాస్తు గడువును పెంచారని అన్నారు. అర్హులై ఉండి సకాలంలో ధరఖాస్తు చేయలేని వారికి ఇది సువర్ణవకాశమన్నారు. ధరఖాస్తు చేయని వారు వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!