November 19, 2019

నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా వినోద్ కుమార్ బాధ్యతలు – పలువురు శుభాకాంక్షలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో జేసీగా విజయనగరం జిల్లా ఐటిడిఏ పివో డాక్టర్ వి. వినోద్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ వినోద్ కుమార్ నెల్లూరుకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో కలెక్టరేట్ కు చేరుకుని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, కలెక్టరేట్ ఏఓ రామారావు, డిఎస్ఓ బాలకృష్ణ, సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు నూతన జేసీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరయిన నెల్లూరుజిల్లాకు జేసీగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాను అన్నీ విధాలా అభివృద్ధి పరచడంతో పాటూ సంక్షేమ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!