December 16, 2019

నూతన విద్యా విధానాలపై బెంగుళూరులో సదస్సు – పాల్గొన్న డాక్టర్ కృష్ణ కిషోర్

Clock Of Nellore ( Nellore ) – ప్రస్తుతమున్న నూతన విద్యా విధానాలపై చర్చించేందుకు బెంగుళూరులో అంతర్జాతీయ స్థాయి విద్యా సదస్సు జరిగింది. అంతర్జాతీయ బకాలారియట్ సంస్థ నిర్వహించిన ఈ సదస్సుకు నెల్లూరు నుండి డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్, వాసంతి కిషోర్ పాల్గొన్నారు. మూడు రోజుల పాటూ జరిగిన ఈ సదస్సులో మన దేశంతో పాటూ ఇతర దేశాలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల యజమానులు, వారి ప్రతినిధులు, విద్యావేత్తలు, విశ్లేషకులు హాజరయ్యారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న నూతన విద్యా విధానాలు, నూతన పద్దతులను ఉపాధ్యాయులు ఎలా అనుసరించాలి, వారి ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. అంతే కాకుండా విద్యార్ధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాభ్యాసం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్స్ రత్నం అధినేత డాక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ సదస్సులో చర్చించిన ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకని తమ విద్యాసంస్థల్లో ప్రవేశపెడతామని, విద్యార్ధులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విద్యను బోధిస్తామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!