November 22, 2019

పేదల చెంతకే ఉచిత వైద్యం – డాక్టర్ బిందుమీనన్ దాతృత్వం

Clock Of Nellore ( Vidavalur ) – ఖరీదైన వైద్యసేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తూ ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న నెల్లూరు అపోలో హాస్పిటల్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ బింధు మీనన్ తన ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలను మరింత విస్త్రృతం చేస్తున్నారు. మొబైల్ క్లినిక్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్తు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. తాజాగా డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలం లోని ఊటుకూరు పెద్దపాళెంకు వెళ్లిన ఆమె ముందుగా న్యూరాలజీ సంబంధ వ్యాధులపై స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూర్చ, తలనొప్పి, మెదడు, నరాల వ్యాధులకు సంబంధించి 100 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. వారికి అవసరమైన మందులను డాక్టర్ బింధు మీనన్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికైనా పక్షవాత లక్షణాలు కనిపిస్తే వారిని నాలుగున్నర గంటల సమయం లోపు అత్యవసర వైద్య విభాగం కలిగిన ఏదైనా ఆసుపత్రికి తరలిస్తే వారి మెదడు దెబ్బతినకుండా కాపాడగలగవచ్చునని చెప్పారు. డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు అవసరమొచ్చినా ఉచితంగా వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. తమ గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించినందుకు స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!