January 23, 2020

నెల్లూరు అపోలో హాస్పిటల్స్ లో అరుదైన ఆపరేషన్ – జిల్లాలో తొలి సర్జరీ సక్సెస్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా చరిత్రలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన రికార్డును సాధించింది. జిల్లాలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని అరుదైన, ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను మంగళవారం విజయవంతంగా నిర్వహించి తనకు తానే సాటి అని మరో సారి రుజువు చేసుకుంది. వివరాల్లో కెళ్తే… నెల్లూరు నగరానికి చెందిన దావూద్ అనే 9 సంవత్సరాల బాలుడికి పుట్టి మూగ, చెవుడు. నిరుపేద కుటుంబం కావడంతో వారు నగరానికి చెందిన శాసనసభ్యులను ఆశ్రయించగా వారు అపోలో హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. దీంతో దావూద్ ను వారి కుటుంబభ్యులు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న హాస్పిటల్ ఈ.ఎన్.టి సర్జన్ డాక్టర్ సుంకు సతీష్ కుమార్ దావూద్ కు పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహించాలని చెప్పారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో చంఢీఘర్ PGIMAR హాస్పిటల్ ఈ.ఎన్.టి హెడ్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ నరేష్ కుమార్ పండా సహకారంతో బాలుడికి కాక్ లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ను నిర్వహించారు. నెల్లూరుజిల్లా చరిత్రలో ఇప్పటి వరకూ ఇలాంటి అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్ ఎక్కడా జరగలేదు. ఇదే తొలిసారి. ఆపరేషన్ విజయవంతం అయ్యింది.

ఈ సందర్భంగా మంగళవారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుంకు సతీష్ కుమార్, డాక్టర్ నరేష్ కుమార్ పండా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మనిషి చెవితో వినాలన్నా, నోటితో మాట్లాడాలన్నా మెదడు నుండి సంకేతాలు రావాల్సి ఉంటుందని అప్పుడే ఎవరైనా వినడం, మాట్లాడటం జరుగుతుందని చెప్పారు. పుట్టి మూగ, చెవుడు ఉన్న ఈ బాలుడికి నోరు, గొంతు, చెవితో మెదడుకు అనుసంధానమైన ప్రాంతంలో శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు చెప్పారు. ఈ శస్త్ర చికిత్స ఎంతో క్లిష్టమైందని, అరుదైందని వివరించారు. ఇలాంటి శస్త్ర చికిత్సలు పెద్ద వయసు వారికి నిర్వహిస్తుంటారని, అయితే తొలిసారిగా 9 ఏళ్ల బాలుడికి నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ తరహా శస్త్ర చికిత్సలకు అపోలో హాస్పిటల్ లో అన్నీ సదుపాయాలు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ నవీన్ మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఈ ఆపరేషన్ విజయవంతంగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అరుదైన ఘనతకు కారణమైన ఈ.ఎన్.టి సర్జన్ డాక్టర్ సుంకు సతీష్ కుమార్ కు, చంఢీఘర్ PGIMAR హాస్పిటల్ ఈ.ఎన్.టి హెడ్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ నరేష్ కుమార్ పండాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆపరేషన్ కు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అయితే నెల్లూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు కొంత మేర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సమకూర్చగా, మిగిలిన మొత్తం అపోలో హాస్పిటల్ యాజమాన్యమే భరించి ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.

1 thought on “నెల్లూరు అపోలో హాస్పిటల్స్ లో అరుదైన ఆపరేషన్ – జిల్లాలో తొలి సర్జరీ సక్సెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!