November 16, 2019

దివ్యాంగుల కేంద్రంలో దీపావళి వేడుకలు – ఆనందోత్సాహంలో చిన్నారులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎమ్.ఎస్.ఆర్ స్పాస్టిక్ సెంటర్ లో దీపావళి సంబరాలు జరిగాయి. దివ్యాంగ, మానసిక వికలాంగ పిల్లలు ఉండే ఈ సెంటర్ లో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నగరానికి చెందిన రాజస్థాన్ పత్రిక ప్రతినిధి విక్రమ్ జైన్ ఆయన తల్లి రేఖా లలితా జైన్ లు పిల్లలతో దీపావళి సంబరాలు జరిపించారు. మానసిక వికలాంగుల్లో ఆనందాన్ని నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలచే టపాకాయలు కాల్పించి వారిని సంతోష పెట్టారు. అలాగే వారికి స్వీట్లు పంచిపెట్టారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ దీపావళి వేడుకల పట్ల స్పాస్టిక్ సెంటర్ కన్వీనర్ బి. మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విక్రమ్ జైన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపల్ గురునాథరావు, వైస్ ప్రిన్సిపల్ మాధురి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!