November 12, 2019

నెల్లూరుజిల్లాలో దీపావళి సందడి – కిక్కిరిసిపోయిన టపాకాయల దుకాణాలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో దీపావళి సందడి మొదలైంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో ఒక రోజు ముందే దీపావళి సంబరాలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం నుండే నగరంలో టపాకాయల మోతలు ప్రారంభమైనాయి. నగరంలోని విఆర్సీ మైదానం, వై.ఎమ్.సి.ఏ మైదానం, ఆర్ఎస్ఆర్ స్కూల్ మైదానాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు జారీ చేశారు. ఈ నేపద్యంలో శుక్రవారమే దుకాణాలను ప్రారంభించిన టపాకాయల విక్రయదారులు వివిధ రకాల టపాకాయలను విక్రయానికి ఉంచారు. శనివారం అన్నీ దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ఈ సందర్బంగా దుకాణాదారులు మాట్లాడుతూ ధరలు అందుబాటులో ఉన్నాయని, వివిధ రకాల టపాకాయలు కూడా విక్రయానికి సిద్దంగా ఉన్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!