November 19, 2019

కావలి ఏరియా వైద్యశాలలో జిల్లా కలెక్టర్ తనిఖీలు – సదుపాయాలపై సమీక్ష

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లాలోని కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి హాస్పిటల్ ను పరిశీలించారు. పారిశుధ్యం, కనీస వసతులను స్వయంగా పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులను వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ అడిగారు. విష జ్వరాలు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైద్యశాలకు అవసరమైన పరికరాలు, సిబ్బంది కొరతను కలెక్టర్ దృష్ఠికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!