November 19, 2019

నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన చంద్రబాబు – నేతల తీరుపై అసంతృప్తి

Clock Of Nellore ( Nellore ) – రెండు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తర్వాత ఒక్కొక్క నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. మాగుంట లే అవుట్ లోని అనీల్ గార్డెన్స్ లో ఈ సమీక్షలు జరిగాయి. తొలిరోజు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. కార్యకర్తల నుండి నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నియోజకవర్గాల ఇంఛార్జ్ లు అందుబాటులో ఉంటున్నారా లేదా అని కార్యకర్తలను అడగ్గా అనేక మంది లేదని చెప్పినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో తమపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నా నియోజకవర్గ ఇంఛార్జ్ లు పట్టించుకోవడం లేదని చెప్పినట్లు సమాచారం. దీనికి స్పందించిన చంద్రబాబు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వారికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. వారి రాజకీయ ఎదుగుదలకు తనది హామీ అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!