November 12, 2019

నవంబర్ 1 నుండి నెల్లూరులో అక్రమ కట్టడాల కూల్చివేత – ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – నిబంధనలకు విరుద్ధంగా మురుగునీటి కాలువలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎమ్.వి.శేషగిరి బాబు నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. తన ఛాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూములు, మున్సిపల్ స్థలాలు, రెవెన్యూ పోరంబోకు స్థలాల్లో అక్రమంగా వెలసిన కట్టడాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పార్కింగ్ స్థలం లేకుండా నిర్మించిన కట్టడాలు, ఇచ్చిన ప్లాన్ కు భిన్నంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సూచించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. అలాగే వాటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు గుణశేఖర్, రామలింగేశ్వర రెడ్డి, రమేష్ బాబు, గోవర్ధన్, శివ ప్రసాద్, హృదయరాజు, కృష్ణయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!