November 22, 2019

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం – రేపటి కల్లా తుఫాను… తర్వాత పెను తుఫాను..

Clock Of Nellore ( Central Desk ) – ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ను ఆనుకుని సోమవారం ఏర్పడ్డ అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. బుధవారం ఉదయం 5.30 గంటలకు తుఫానుగా మారి, ఈనెల 7వ తేదీనా తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. అంతే కాకుండా 8వ తేదీనా పెను తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. 9వ తేదీ వరకూ బంగాళాఖాతంలోని వాయుగుండం దాని గమనం, ఇతర వివరాలకు సంభందించి భారత వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. తుఫాను దక్షిణ కోస్తావైపు పయనించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను ప్రభావంతో ఇప్పటికిప్పుడు వర్షాలు పడే పరిస్థితి లేదన్నారు. దక్షిణ కోస్తాలో 9వ తేదీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తుఫాను ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే పూర్తి వివరాలను వాతావరణ శాఖ వెల్లడించలేదు. 9వ తేదీ వరకూ మాత్రమే ప్రకటించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!