November 21, 2019

కృష్ణపట్నం పోర్టులో చుక్కల తిమింగలం – బోటు ఫ్యాన్ తగిలి మృత్యువాత

Clock Of Nellore ( Krishnapatnam Port ) – నెల్లూరుజిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో భారీ చుక్కల తిమింగలం దర్శనమిచ్చింది. పోర్టు సమీపంలో సముద్ర జలాల్లో తిరుగుతున్న ఆ భారీ తిమింగలం బోటు ఫ్యాన్ తగిలి మృతి చెందిందని అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం చిల్లకూరు సమీపంలో సముద్ర జలాల్లో తిమింగలం కళేబరం కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు తిమింగలం కళేభరాన్ని పోర్టుకు తీసుకొచ్చారు. సుమారు టన్ను బరువున్న ఆ తిమింగలంకు తల భాగం పూర్తిగా ఛిద్రమై ఉంది. బోటు ఫ్యాను తగిలి మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!