November 19, 2019

నెల్లూరు పోలీస్ కార్యాలయంలో విజయదశమి – ఆయుధాలకు పూజలు చేసిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి సంబరాలు ఘనంగా జరిగాయి. ఎస్పీ బంగ్లాతో పాటూ ఆర్మ్ డ్ ఫోర్స్, మోటార్ ట్రాన్స్ పోర్టు కార్యాలయాల్లో జరిగిన దసరా సంబరాలకు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హాజరయ్యి పూజలు నిర్వహించారు. సిబ్బందితో కలిసి ఆయుధాలకు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లాకు నూతనంగా కేటాయించిన వజ్ర వాహనాన్ని పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రస్తోగి మాట్లాడుతూ చెడుపై విజయానికి నాందిగా విజయదశమిని నిర్వహించుకుంటామని, పోలీస్ కార్యాలయంలో కుల, మతాలకు అతీతంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పోలీసులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వజ్ర వాహనం గురించి వివరిస్తూ బంద్ లు, రాస్తోరోకోల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు, బాష్ప వాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించేందుకు వీలుగా వజ్ర వాహనం రూపొందించారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ వీరభద్రుడు, నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, వెల్ఫేర్ ఆర్.ఐ చంద్రమోహన్, ఆర్.ఐ. అడ్మిన్ మౌలుద్దీన్, ఎమ్.టి.ఓ గోపీనాథ్ పాల్గొన్నారు. 

వజ్ర వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ రస్తోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!