November 12, 2019

భార్య ప్రాణం పోయిందని భర్తకూడా ప్రాణం తీసుకున్నాడు – నెల్లూరుజిల్లాలో విషాదం

Clock Of Nellore ( Nellore ) – అప్పు దంపతుల ఉసురుతీసింది. నెల్లూరుజిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామానికి చెందిన షేక్ రఫీకి పొదలకూరు మండలం విరువూరు గ్రామానికి చెందిన బీబిజాన్ కు వివాహమైంది. కొద్ది రోజుల తర్వాత రఫీ చేసిన కొన్ని వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. ఇదే సందర్భంలో బీబిజాన్… తల్లి అనారోగ్యం కారణంగా విరువూరుకు వెళ్లింది. 15 రోజులు గడుస్తున్నా భార్య ఇంటికి రాకపోవడంతో ఆగ్రహించిన రఫీ, భార్యపై కోప్పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన బీబిజాన్ ఆదివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు ఆమెను నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. భార్య మృతి జీర్ణించుకోలేని భర్త కూడా పురుగుల మందు తాగాడు. అతను కూడా మంగళవారం హాస్పిటల్ చనిపోయాడు. మృతులకు ఇద్దరు పిల్లలు. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!