January 23, 2020

రేపే పిఎస్ఎస్వీ – సి48 రాకెట్ ప్రయోగం – మొదలైన కౌండ్ డౌన్

Clock Of Nellore ( SrihariKota ) – వరుస రాకెట్ ప్రయోగాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ముందుకు దూసుకెళ్తుంది. గత నెల 27వ తేదీనా పిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా కార్టొశాట్ ఉపగ్రహన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో… రోజుల వ్యవధిలోనే మరో ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం పిఎస్ఎల్వీ – సి48 రాకెట్ ను ప్రయోగించనుంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా 628 కేజీల బరువైన రీశాట్ – 2బిఆర్1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దానితో పాటూ అమెరికా, ఇజ్రాయెల్, జపాన్ దేశాలకు చెందిన మరో 8 ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి 11వ తేదీ మధ్యాహ్నం 3.25 నిముషాలకు పిఎస్ఎల్వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. మార్చి నెలలోగా శ్రీహరికోట నుండి మొత్తం 15 ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇది వరకే ఇస్రో ఛైర్మైన్ శివన్ ప్రకటించి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!