November 16, 2019

నెల్లూరులోని పురాతన వినాయక మహాల్ ను సీజ్ చేసిన కార్పొరేషన్ అధికారులు – అపరిశుభ్రతే కారణం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పురాతన వినాయక సినిమా హాల్ ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం సీజ్ చేశారు. నిరుపేదల సినిమా హాల్ గా పేరు పొందిన ఈ హాల్ లో పరిశుభ్రత మరీ దారుణంగా ఉండటంతో హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ తనిఖీ చేసి తాళాలు వేశారు. ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం సాయంత్రం హాల్ ను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం, హాల్లో పరిశుభ్రతను పరిశీలించారు. అక్కడి వాతావరణం అత్యంత దయనీయంగా, దారుణంగా ఉండటంతో హాల్లో ఉన్న ప్రేక్షకులను బయటకు పంపించి వేశారు. తర్వాత హాలుకు తాళాలు వేశారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వెంకట రమణ పేర్కొన్నారు. 

హాలు ఆవరణంలో తనిఖీలు నిర్వహిస్తున్న హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!