November 21, 2019

నెల్లూరుజిల్లా అగ్రిగోల్డ్ బాధితులకు 17 కోట్లు – చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని 24,390 మంది అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 17కోట్ల రూపాయలను అందజేయనున్నామని కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు వెల్లడించారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని హెచ్.ఎన్.ఆర్ రెసిరెన్సీ హోటల్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా 10వేల లోపు డిపాజిట్ దారులకు క్లైములు చెల్లిస్తున్నామన్నారు. బాధితుల ఖాతాల్లో వారికి రావల్సిన మొత్తం జమ అవుతుందని వివరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రప్రధమంగా అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులకు పరిహారం చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ చెప్పిన మాట ముఖ్యమంత్రి ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎస్పీ ఆశ్వర్య రస్తోగి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!