November 22, 2019

ఎమ్పీ విజయసాయి రెడ్డి స్వగ్రామం తాళ్లపూడిలో అభివృద్ధి పనులు – గ్రామాన్ని సందర్శించిన కాకాణి, కలెక్టర్

Clock Of Nellore ( Muthukur ) – వైసీపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్వగ్రామమైన నెల్లూరుజిల్లా, ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి గ్రామంలో జిల్లా కలెక్టర్ శేషగిరి బాబుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ గ్రామ అభివృద్ధికి ఎమ్పీ విజయసాయి రెడ్డి 6కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ నేపద్యంలో గ్రామంలో చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. స్థానిక అధికారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. 6 కోట్ల రూపాయల నిధులకు సంభందించి చేపట్టాల్సిన పనులకు వెంటనే అంచనాలను సిద్దం చేయాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తాళ్లపూడి గ్రామం తన నియోజకవర్గమైన సర్వేపల్లిలో ఉండటం సంతోషమన్నారు. జిల్లాకు చెందిన మరో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా గ్రామ అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నారని కాకాణి వెల్లడించారు. తాళ్లపూడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి అభివృద్ధిపై సమీక్ష నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!