November 16, 2019

డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – వైఎస్ఆర్ వాహన మిత్ర సభలో కలెక్టర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – స్వంతంగా ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ వాహనాలు నడుపుకునే యజమానులు, డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు వెల్లడించారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ వాహన మిత్రకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. నెల్లూరు టౌన్ హాల్లో శుక్రవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి అర్హులైన వాహనదారులతో పాటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ధిక స్తోమత లేని సొంత వాహనాల యజమానులు, డ్రైవర్లకు వారి వారి వాహనాల మరమ్మత్తులు, భీమా, ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు సకాలంలో పొందలేక సతమతమవుతున్నారని అన్నారు. వారి పరిస్థతిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకానికి రూపకల్పన చేశారన్నారు. జిల్లాలో 13,792 మంది ధరఖాస్తు చేసుకోగా 13,697 మంది అర్హత సాధించారని వివరించారు. వారందరికీ 10వేల చొప్పున వారి వారి ఖాతాల్లో జమచేస్తామన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నామని కలెక్టర్ వెల్లడించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాహనదారులు, డ్రైవర్లకు సంవత్సరానికి 10వేల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి వారి భోరోసా కల్పించారని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వారిని వేధింపులకు గురిచేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి నేత రూప్ కుమార్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!