November 16, 2019

ఎన్ని జన్మలెత్తినా నెల్లూరు రుణం తీర్చుకోలేను… అందుకే అనీల్ ను ఇరిగేషన్ మంత్రిని చేశా… జగన్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – మొదటి నుండి తనను తమ సొంత బిడ్డలా ఆదరించి, ఆశీర్వదిస్తున్న నెల్లూరుజిల్లా ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్ అనంతరం తన ప్రసంగంలో నెల్లూరుజిల్లాపై ప్రత్యేకంగా మాట్లాడారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్రకొచ్చినప్పుడు జిల్లా ప్రజల మమకారం మరువలేనిదని పేర్కొన్నారు. తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా 8 అసెంబ్లీ స్థానాలతో పాటూ ఒక పార్లమెంటు స్థానాన్ని అందించి తనపై ఉన్న అభిమానాన్ని చాటారని గుర్తు చేశారు. అలాగే ప్రజా సంకల్ప పాదయాత్రలో తనను అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న దృఢమైన కోరికతో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లతో పాటూ రెండు పార్లమెంటు స్థానాలను వైసీపికి కట్టబెట్టారని మొదటి నుండి ఇంతటి అభిమానాన్ని చాటుతున్న నెల్లూరుజిల్లా ప్రజలకు ఎమిచ్చినా రుణం తీరదని ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. అందుకే ఈ రాష్ట్రానికి ఎంతో కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అవకాశం కల్పించానని జగన్ చెప్పారు. అనీల్ ఆధ్వర్యంలో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!