November 16, 2019

నెల్లూరుజిల్లాలో విషాదం – లారీ ఢీ కొని ఇద్దరు మృత్యువాత – మహిళకు తీవ్ర గాయాలు

Clock Of Nellore ( Chillakur ) – నెల్లూరుజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పనులు ముగించుకుని రాత్రి 7 గంటల సమయంలో బైక్ పై ఇంటికెళుతుండగా లారీ వారి పాలిట మృత్యుపాశమైంది. చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై ముత్యాలపాడు వద్ద లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ దర్ఘటనలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, అదే బైక్ పై ఉన్న మహిళ తీవ్ర గాయాలపాలైంది. మృతులు అంకులపాటూరుకు చెందిన సంతోష్, ముత్తయ్యగా గుర్తించారు. గాయపడిన మహిళ రమాదేవిగా నిర్ధారించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!