November 12, 2019

అదుపుతప్పిన కారు – ఆటోను ఢీ – 8 మందికి గాయాలు

Clock Of Nellore ( Venkatagiri ) – నెల్లూరుజిల్లా వెంకటగిరి మండలం అమ్మపాళెం వద్ద ఆగి ఉన్న ఆటోను కారు ఢీ కొట్టింది. డ్రైవర్ తో సహా మొత్తం 8 మంది ప్రయాణీకులతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి వస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. కారు వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో ఆటో కొద్ది దూరం ముందుకు దీసుకెళ్లి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 8 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంకటగిరి పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!