November 19, 2019

విజయవాడకు బయలుదేరిన సిఎం జగన్ – వీడ్కోలు పలికిన జిల్లా నేతలు, అధికారులు

Clock Of Nellore ( Nellore ) – రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ సభకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రైతు భరోసా సభ 1.30 గంటల వరకూ సాగింది. సభ అనంతరం విక్రమ సింహపురి యూనివర్శిటీలోకి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ కొద్ది సేపు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్పీలతో మాట్లాడారు. తర్వాత అక్కడే భోజనం చేసి 2.30 గంటలకు హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయంకు వెళ్లారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ వద్ద మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు, ఎస్పీ సిద్ధార్ధ కౌషల్ తదితరులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!