November 16, 2019

నెల్లూరులో కూలిన బ్రిటీష్ కాలం నాటి పెన్నా వారధి వంతెన – తూములు యధాతథం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నుండి వెంకటేశ్వరపురంకు పెన్నానదిలోంచి వెళ్లే వారధి వంతెన శుక్రవారం సాయంత్రం కూలిపోయింది. 630 మీటర్ల వ్యాసార్ధం కలిగిన ఈ వారధిలో దిగువకు నీరు వెళ్లేందుకు గేటు వద్ద బ్రిటీష్ కాలంలో నిర్మించిన సుమారు 20 అడుగుల వంతెన నీటి ప్రవాహానికి కుప్పకూలింది. గత 4 రోజులుగా నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నీళ్లు వెళ్లే తూములు… దాని పై నున్న రోడ్డుకు మధ్యలోని ప్రదేశంలో ఉండే గ్రావెల్ మట్టి, బండరాళ్లు కొట్టుకుపోయి సొరంగం ఏర్పడింది. గురువారం సాయంత్రం నుండి ఈ సొరంగం ఏర్పడుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రంకు తూములు పైన ఉండే రోడ్డుకు మధ్య డొల్లగా మారింది. దీంతో వంతెన పై భాగం బరువు అధికమయ్యి కుప్పకూలిపోయింది. సుమారు 5 మేర వంతెన కిందకు కూలిపోయింది. కూలే సమయంలో పెన్నా నీటి పరవళ్లను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు భయపడిపోయారు. అయితే రోడ్డు కూలింది గానీ ఉన్న 5 తూములు మాత్రం యధాతథంగానే ఉన్నాయి. వాటిల్లో యధావిధిగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ వంతెన కుప్పకూలడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఎలాగూ పెన్నా బ్యారేజీ పనులు పూర్తయితే దీని అవసరం ఉండదు. ఒక వేళ అవసరం ఉన్నా మరమ్మత్తులు చేసుకునే వెసులుబాటు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!