January 23, 2020

నెల్లూరులో ఉత్సాహంగా జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలు – విజేతలకు బహుమతులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. నెల్లూరుజిల్లా అమేచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని స్వతంత్ర పార్కులో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు, కోవూరు, గూడూరు ప్రాంతాల నుండి 59 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 50, 55, 60, 65, 70, 75, 80 విభాగంలో పోటీలు జరిగాయి. ఒక్కో విభాగం నుండి ముగ్గరేసి చొప్పున విజేతలను ఎంపిక చేశారు. ఆదివారం అర్దరాత్రి వరకూ ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. సోమవారం ఉదయం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఓవరాల్ ఛాంపియన్ గా షబ్బీర్ ఖాన్ విజేతగా నిలవగా, రన్నరప్ గా అవిజీత్ నిలిచారు. అత్యధికంగా హనుమాన్ జిమ్ కు చెందిన క్రీడా కారులు బహుమతులు గెలుచుకున్నారు. బహుమతి ప్రాధానోత్సవానికి నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ కో – ఆర్డినేటర్ మహేంద్రరెడ్డి, పోతురాదు రామకృష్ణ, జీవన్ కృష్ణా, అసోసియేషన్ మీడియా కన్వీనర్ అరవ పూర్ణ ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!