November 19, 2019

టిడిపి, వైసీపి రెండు అవినీతి ప్రభుత్వాలే – బిజేపి వల్లే అభివృద్ధి సాధ్యమన్న కన్నా

Clock Of Nellore ( Nellore ) – గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం వైసీపి ప్రభుత్వం రెండూ అవినీతి ప్రభుత్వాలేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. శుక్రవారం ఆయన నెల్లూరుజిల్లాలో పర్యటించారు. ముత్తుకూరులో బిజేపి నేతలు చేపట్టిన గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నెల్లూరులోని బిజేపి జిల్లా కార్యాలయంకు చేరుకున్నారు. కన్నా ఆధ్వర్యంలో పలువురు బిజేపి పార్టీలో చేరారు. తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి యుశ్వంత్ సింగ్ తన అనుచరులతో కలిసి బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండు ఇసుకను దోపిడీ చేసిందని అన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయని ఫలితంగా కార్మికులకు పనిలేకుండా పోయిందని చెప్పారు. ఇసుక విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈడీ కేసులు ఉన్నవారే బిజేపిలో చేరుతున్నారని విలేకరులు ప్రశ్నించగా కొంత మంది పనిగట్టుకుని బిజేపిపై దుష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటుందని బిజేపిలోకి అందరికీ ఆహ్వానం ఉంటుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి బిజేపితోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని, ప్రజల నాడిని గ్రహిస్తున్న నేతలు బిజేపిలోకి వలసలు వస్తున్నారని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్తు బిజేపిదేనని కన్నా స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!