November 22, 2019

నెల్లూరులో బెజవాడ ఓబుల్ రెడ్డి ఉత్తర క్రియలు – హాజరైన వివిధ పార్టీల నేతలు

Clock Of Nellore ( Nellore ) – రైతు సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ ఓబుల్ రెడ్డి ఉత్తర క్రియలు శనివారం నెల్లూరులోని వారి నివాసంలో జరిగాయి. గత నెల 23వ తేదీనా ఓబుల్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ కుటుంబసభ్యులు పెద్ద కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటూ టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సివి శేషారెడ్డి, బిజేపి జిల్లా అధ్యక్షులు పి. సురేంద్ర రెడ్డి, సిపిఐ నేత రామరాజు, సిపిఎమ్ నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొని ఓబుల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఓబుల్ రెడ్డి సేవలను కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!