November 22, 2019

నెల్లూరు జిల్లాలో యురేనియం అన్వేషణ ? – పడమటి కంభంపాడు కు చేరిన యంత్రాలు

Clock Of Nellore ( AnanthaSagaram ) – నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో యురేనియం అన్వేషణకు రంగం సిద్ధమవుతోంది. పడమటి కంభంపాడు అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు తవ్వకాలు చేపట్టాలని యోచిస్తున్నారు. దీనికోసం ఆటోమేటిక్ ఎనర్జీ సంస్థ నేతృత్వంలో యంత్రాలు తీసుకొచ్చారు. సోమవారం పలువురు అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. అయితే ప్రాధమిక పరీక్షల్లో అక్కడ యురేనియం నిక్షేపాలు ఉండే అవకాశం లేదని నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో వైపు యురేనియం తవ్వకాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటపొలాలు, తాగునీరు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!