November 16, 2019

నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యా యత్నం – ” స్పందన” లో న్యాయం జరగడం లేదని ఆవేదన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తమకు చెందిన భూముల రికార్డులు వేరే వారి పేర్లతో ఉన్నాయని పేరు మార్పు చేయాలని ఎంతగా తిరుగుతున్నా ఫలితం లేదని మనస్థాపానికి చెందిన ఆమె పురుగుల మందు తాగే ప్రయత్నం చేసింది. అక్కడున్న వారు గుర్తించి అడ్డుకున్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం, ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన చింతాలుగారి గురవమ్మకు భర్త చనిపోయాడు. వారికి చెందిన భూములు భర్త కుటుంబసభ్యుల పేర్లపై ఉన్నాయి. దీంతో ఆమె గత కొంత కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. పేరు మార్పు చేయాలని వేడుకుంటుంది. ఆగస్టు నెలలో దీనిపై అక్కడి తహసీల్ధార్ విచారణ జరిపినా పని కాలేదు. స్పందన కార్యక్రమంలో కూడా నివేదించినట్లు సమాచారం. ఈ నేపద్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ జరిగే స్పందన కార్యక్రమానికి హాజరయిన గురవమ్మ తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగే ప్రయత్నం చేసింది. కొంత మేర గొంతులోకి వెళ్లింది. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. స్పందించిన పోలీసులు ఆమెను ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!