November 12, 2019

నెల్లూరులో అస్సాం బాలిక – కుటుంబసభ్యులకు అప్పగించిన నవాబుపేట పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా, మార్గాటికా తాలూకా, దేహింగ్ పారియా గ్రామానికి చెందిన 15 ఏళ్ల సుమన్ పాల్ అనే బాలిక తప్పిపోయి ఈనెల 23వ తేదీనా నెల్లూరుకు చేరుకుంది. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో అయోమయ స్థితిలో కనిపించిన ఆ బాలికను గుర్తించిన నవాబుపేట పోలీసులు పరిస్థితిపై ఆరా తీయగా తప్పిపోయి ఇక్కడకు వచ్చినట్లు, తమ నివాసానికి ఎలా వెళ్లాలో అర్ధం కావడం లేదని బదులివ్వగా స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. వివరాలను తెలుసుకున్న నవాబుపేట సిఐ వేమారెడ్డి అస్సాం పోలీసులతో సంప్రదింపులు జరిపి సమాచారాన్ని వారి కుటుంబానికి చేర్చారు. తాము వచ్చే వరకూ మీ సంరక్షణలో ఉంచాలని వారు కోరడంతో అప్పటి నుండి నవాబుపేట పోలీసుల సంరక్షణలోనే బాలిక ఉంది. ఆదివారం కుటుంబసభ్యులు నెల్లూరుకు చేరుకోగా వారికి బాలికను అప్పగించారు. పోలీసులే వారిని అస్సాం పంపే ఏర్పాట్లు చేశారు. నవాబుపేట పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

1 thought on “నెల్లూరులో అస్సాం బాలిక – కుటుంబసభ్యులకు అప్పగించిన నవాబుపేట పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!