November 19, 2019

నెల్లూరుజిల్లాలో ఆశ కార్యకర్త ఆత్మహత్యాయత్నం – ఆసుపత్రికి తరలింపు – పరామర్శించిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా దగదర్తి మండలం యలమంచిలిపాడుకు చెందిన ఆశ కార్యకర్త ప్రమీల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజకీయ నేతలు ప్రమేయంతో ఆశ కార్యకర్త నుంచి ఆమెను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మనస్థాపానికి గురైన ప్రమీల పురుగుల మందు తాగింది. స్థానికులు హుటాహుటిన ఆమెను నెల్లూరులోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆపార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, ఆపార్టీ నేతలు బుధవారం హాస్పిటల్ కు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న ప్రమీలను పరామర్శించారు. ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు చిరు ఉద్యోగులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని, దళిత మహిళ అయిన ప్రమీలను వేధించడం దురదృష్ఠకరమని అన్నారు. ఆమె ఒ పక్క హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటే అధికార పార్టీ నేతలు సమావేశం పెట్టుకుని ఆశ కార్యకర్తగా ప్రమీలను తొలగించాలని అధికారులకు చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఘటన అని, ఇతర పార్టీలను అభిమానించే వారు ఉండకూడదనే పరిస్థితి తేవడం దుర్మార్గమని సోమిరెడ్డి అన్నారు. చివరకు ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆశ కార్యకర్తలను రక్షించుకోలేని పరిస్థితిలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఉండటం దురదృష్ఠకరమన్నారు. అధికారులు కలుగజేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే మాదిరిగా కొనసాగితే ప్రజలు తిరగబడతారని సోమిరెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!