November 21, 2019

నెల్లూరులో పూర్తయిన రైతు భరోసా ప్రారంభ సభా ఏర్పాట్లు – విజయవంతం చేయాలని నేతల పిలుపు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన రైతు భరోసా పథకం మంగళవారం ప్రారంభం కానుంది. నెల్లూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నెల్లూరులోని విక్రయ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ సభ జరగనుంది. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఆధ్వర్యంలో సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితో మంత్రి అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, వైసీపి నేతలు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రానికల్లా 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడే ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రైతులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!