November 21, 2019

ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

Clock Of Nellore ( VisakhaPatnam ) – అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్‌ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు జరిగిన ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్‌ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజంతా సందడి వాతావరణం నెలకొంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!