January 23, 2020

ఘనంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ – హాజరైన నలుగురు మంత్రులు

Clock Of Nellore ( Sullurpet ) – నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో శనివారం పక్షుల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ప్రతీ ఏటా జనవరి నెలలో జరిగే ఈ పక్షుల పండుగ ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రులు డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, క్రీడా పోటీలు నిర్వహించారు. ముందుగా మంత్రులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ తో పాటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్టాన్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. అలాగే పట్టణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీని చేపట్టారు. అనంతరం జరిగిన సభలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ మూడు రోజుల పాటూ జరిగే పక్షుల పండుగ వేడుకలను, పక్షుల విన్యాసాలను అందరూ తిలకించి ఆనందించాలని కోరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు, ఇస్రో అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ ఖ్యాతి గడించాయని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటామని హామీా ఇచ్చారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తమ విన్నపాన్ని మన్నించి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, తిరుపతి ఎమ్పీ బల్లి దుర్గా ప్రసాద్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!