January 23, 2020

నెల్లూరు కార్పొరేషన్ ను ప్రక్షాళన చేస్తా – స్పష్టం చేసిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కర్పొరేషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం నెల్లూరుకు విచ్చేసిన ఆయన 51వ డివిజన్ పరిధిలోని కపాడిపాళెంలో పర్యటించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను అక్కడికక్కడే మున్సిపల్ అధికారులకు వివరించి గంటల వ్యవధిలోనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు సమస్య లేకుండా ప్రత్యేక దృష్ఠి సారించాలని చెప్పారు. స్థానికంగా ఉంటూ అర్హులైన వారు రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి అనీల్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నీ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలోని అన్నీ చెరువుల్లో పుష్కలంగా ఎప్పుడూ నీరు ఉండేలా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, బాల ప్రసాద్, ఎలీషా, సరిత, ప్రమీల, ఉమా, సుధీర్, దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై కార్పొరేషన్ ఎస్ఈ ఇమాముద్దీన్ తో మంత్రి చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!