November 22, 2019

వర్షాలతో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు – అధికారులతో మంత్రి అనీల్ సమీక్ష

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాకు భారీ వర్షం హెచ్చరికలతో మంగళవారం రాత్రి హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్న మంత్రి అనీల్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నెల్లూరు నగరం, జిల్లాలోని అన్నీ మున్సిపాల్టీలలో డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో వరదలు సంభవించినప్పుడు నెల్లూరు నగరం అస్థవ్యస్తంగా మారిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలపై 24 గంటలూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!