January 23, 2020

ఆనం విజయకుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డిని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి నెల్లూరు, చింతారెడ్డి పాళెంలోని ఆనం నివాసానికి వెళ్లిన మంత్రి కొద్దిసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఆనం విజయకుమార్ రెడ్డి మంత్రి అనీల్ ను, ఎమ్మెల్యే కోటంరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. వివిధ అంశాలపై వారు కొద్ది సేపు చర్చించుకున్నారు. అనంతరం మంత్రి అనీల్ ను, ఎమ్మెల్యే కోటంరెడ్డిని విజయకుమార్ రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేతలు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!