November 19, 2019

నదీ పరీవాహ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించండి – ముందు జాగ్రత్తలు సూచించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Vijayawada ) – త్వరలో దసరా సెలవులు రానున్న నేపద్యంలో ముఖ్యంగా నదీ పరీవాహ ప్రాంతాల్లోకి వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పలు సూచనలు చేశారు. ఈ మేరకు జాగ్రత్తలతో కూడిన పత్రికా ప్రకటనను మంత్రి కార్యాలయం విడుదల చేసింది. పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మన రాష్ట్రంలోని అనేక నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని గుర్తు చేశారు. దసరా వేడుకల నేపద్యంలో వివిధ నదులు, వాగుల్లో అనేక పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారని వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సెలవుల్లో చిన్నపిల్లలు నదులు, వాగులు, వంకలు సరదాలకు పోయి ఈత కొట్టేందుకు వెళుతుంటారని పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సముద్రం, నదుల్లో విహార యాత్ర చేయదలచిన వారు వాయిదా వేసుకోవాలని చెప్పారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రానికి తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కావున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ అంశాలపై జిల్లా అధికారులు సమీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నీ జిల్లాల అధికారులకు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కార్యాలయం తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!