November 16, 2019

అక్టోబర్ 14న నెల్లూరుకు చంద్రబాబు రాక – పార్టీ బలోపేతం, వైసీపి దాడులపై సమీక్షలు

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు. జిల్లాల వారీగా పర్యటించి నేతలకు ధైర్యాన్ని నూరిపోసేందుకు కార్యచరణను రూపొందించారు. ఇందులో భాగంగా ఆయన అక్టోబర్ 14, 15 తేదీల్లో నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, వైసీపి దాడులపై చర్చించనున్నారు. చంద్రబాబు పర్యటన ఖరారైన నేపద్యంలో ఆదివారం టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. నెల్లూరు నగర, రూరల్ ఇంఛార్జ్ లు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, అబ్ధుల్ అజీజ్, నగర టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ జెడ్. శివ ప్రసాద్, ఆనం వెంకటరమణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించి ఖరారు చేశారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పలువురు నేతలకు అప్పగించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న నేపద్యంలో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో పార్టీ సమావేశాలు మాగుంట లే అవుట్ లోని అనీల్ గార్డెన్స్ లో నిర్వహించాలని నేతలు తీర్మానించారు. వైసీపి దాడులకు బలైన టిడిపి నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యేలా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతే కాకుండా అధినేత చంద్రబాబు ఉండే రెండు రోజులు నగరమంతా పసుపు మయం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!